Big News: వాయిదా పడ్డ ఈసెట్‌, ఎంసెట్‌ షెడ్యూల్‌ ఖరారు

0
68

భారీ వ‌ర్షాల కారణంగా తెలంగాణాలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో జ‌ర‌గాల్సిన ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్, ఈసెట్ ప్ర‌వేశ‌ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. వాయిదా ప‌డ్డ ఈ ప‌రీక్ష‌ల తేదీల‌ను రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి ఖ‌రారు చేసింది. ఈ నెల 30, 31 తేదీల్లో ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ను, ఆగ‌స్టు 1న ఈసెట్, ఆగ‌స్టు 2 నుంచి 5వ తేదీ వ‌ర‌కు టీఎస్ పీజీఈసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.