ప్రపంచంలో అతి పెద్ద అడవులు అమెజాన్ అడవులు. అలాంటి అమెజాన్ అడవుల్లో రహస్య రన్వే ఉంది దీని గురించి అందరూ విని షాక్ అవుతున్నారు. అయితే ఇక్కడ ఏమైనా పరిశోధనలకు ఇలా విమానాలు ఆగేందుకు ఈ రన్ వే ఉందా అని చాలా మంది అనుకుంటున్నారు. బ్రెజిల్-బొలీవియా సరిహద్దుల్లోని అమెజాన్ అటవీ ప్రాంతంలోఈ రహస్య రన్వేను అధికారులు గుర్తించారు.
ఈ రన్ వేను ఎవరు ఏర్పాటు చేసుకున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. డ్రగ్ స్మగ్లర్లు ఏర్పాటు చేసుకున్నారట ఈ రన్ వే. దీనిని బొలీవియా యాంటీ-నార్కొటిక్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు బాంబులతో ధ్వంసం చేశారు. బ్రెజిల్ కు చెందిన హెలికాప్టర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఎంత తెలివిగా ఇక్కడ నుంచి డ్రగ్స్ తీసుకు వెళుతున్నారంటే, ఇక్కడ పైలట్ రహస్య రన్వే నుంచి ఒక్కో ట్రిప్పుకు 300 నుంచి 450 కిలోల డ్రగ్స్తో నెలకు ఆరు సార్లు విమానం తీసుకెళ్లినట్లు విచారణలో తెలిపాడు. ఏడాది కాలంగా దీనిని ఈ స్మగ్లర్లు ఉపయోగిస్తున్నారట.