యువకుడి ఓవరాక్షన్..సింహం ఎన్‌క్లోజర్ దగ్గరికి వెళ్లి..

The young man hull hull..the lion went near the enclosure ..

0
79

హైదరాబాద్​ ప్రఖ్యాత నెహ్రూ జూలాజికల్ పార్కులో మంగళవారం నాడు ఓ యువకుడు హద్దుమీరి సింహంతో చెలగాటం ఆడాడు. ఆ దృశ్యాలు చూసి పార్కులో మహిళలు, పిల్లలు, పెద్దలు పెద్దపెట్టున కేకలు వేశారు. కాలు రెండంగులాలు పట్టు తప్పి ఉంటే అతను ఈ పాటికి సింహానికి ఆహారమైపోయేవాడు. ఠారెత్తించే ఘటనకు సంబంధించి ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది. జూపార్క్ సిబ్బంది, బహదూద్ పురా పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..

హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూ పార్కులో మంగళవారం ఓ యువకుడు ఓవరాక్షన్ చేశాడు. ఆఫ్రికన్ సింహం ఎంక్లోజర్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. ఫెన్సింగ్ దూకిమరీ లోపలికి ప్రవేశించిన ఆ యువకుడు..సింహానికి కేవలం ఐదారు అడుగుల ఎత్తులో నిలబడి రెచ్చగొట్టాడు. ప్రశాంతంగా అటు ఇటూ తిరుగుతోన్న సింహం..వీడి చర్యలకు విసిగెత్తినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఒక దశలో వాణ్ని నోట కరిచేందుకు సింహం పైకి ఎగిరే ప్రయత్నం చేసింది.

యువకుడు సింహానికి దగ్గరగా వెళ్లడం చూసి బయటున్నవారంతా కేకలు పెట్టారు. దీంతో జూసిబ్బంది పరుగున వచ్చి వాణ్ని సింహానికి బలైపోకుండా కాపాడారు. అనంతరం బహదూర్ పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింహంతో చెలగాటమాడిన యువకుడిని జి.సాయికుమార్ గా గుర్తించామని, మద్యం మత్తులోనే అతనీ చర్యకు పాల్పడ్డాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బహదూర్ పురా పోలీసులు తెలిపారు.

https://www.facebook.com/alltimereport/videos/297952432225699