పెళ్లిలో తలంబ్రాలు పోసుకోవడానికి గల కారణాలు ఇవే..

0
106

పెళ్ళి అనేది జీవితంలో ముఖ్యమైన ఘట్టం. పెళ్ళికి ముందు ఇరు కుటుంబాలు ఓకే అనుకున్న తర్వాత పెళ్లిని నిశ్చయించి అనేక ఘట్టాలతో పెళ్లిని అంగరంగవైభవంగా జరుపుతారు. ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే భాగ్యస్వాములను అంగీకారం మేరకు పెళ్ళి చేస్తారు. పెళ్లిని  భారతీయ సంస్కృతిలో హిందువులు చాలా ఆనందంగా జరుపుకుంటారు.

పెళ్లిలా సీసన్ వచ్చిందంటే చాలు ఊర్లలో సంబురాలతో పండగల ఉంటుంది. తాళి కట్టడం, అరుంధతి, మెట్టలుపెట్టడం, తలంబ్రాలు పోసుకోవడం ఇలా ఎన్నో ఘట్టాలతో వధువరులు పెళ్లి జరుపుకుంటారు. అయితే వాటిలో తలంబ్రాలు పోసుకోవడం కూడా చాలా ముఖ్యమైన ఘట్టం. తలంబ్రాలు అంటే పసుపు కలిపినా బియ్యం అని అర్ధం.

కానీ తలంబ్రాలు పోసుకునేటప్పుడు సగం విరిగిన బియ్యాన్ని వాడకూడదని పెద్దలు చెప్తుంటారు. ఈ తలంబ్రాలు పోసేటప్పుడు బ్రాహ్మణులు చదివే మంత్రం లో విశేషమైన అర్థాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. సిరిసంపదలు సమృద్ధిగా రావాలని బ్రాహ్మణులు మంత్రాలు చదువుతూ ఉంటారు. వృద్ధి శాంతి, తుష్టి పుష్టి కలగాలని నవ వధువు, వరులతో ఈ ఘట్టం జరిపిస్తారు.