హనుమంతుడిని తమలపాకులతో పూజిస్తే కలిగే ఫలితాలు ఇవే

These are the results of worshiping Hanuman with betel leaves

0
99

 

ప్రతీ మంగళవారం చాలా మంది భక్తులు ఆంజనేయుడికి తమలపాకు మాల (హారాలు ) వేస్తారు. ఇలా స్వామిని శాంతింప చేసి ఈ నాగవల్లీ దళాలతో పూజిస్తారు. ఇలా చేయడం వల్ల మన కుటుంబం పై ఆ ఆంజనేయుడి కృప ఉంటుంది. ఇలా పూజిస్తే స్వామి అనుగ్రహం, వ్యాపారంలో లాభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

ప్రతీ మంగళవారం ఇలా తమలపాకుమాల వేయడం వల్ల, స్వామి ఆ ఇంటిపై కృప చూపిస్తారు. ఆ ఇంటిపై ఉన్న చీడ -పీడ తొలగుతుంది. ఎలాంటి గ్రహ పీడ ఉన్నా పోతుంది. ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఉంటే 108 తమలపాకులతో ఇలా మాల చేసి స్వామికి ఇవ్వండి.ఎంతో ప్రతిఫలం, ఆరోగ్య బాధలు తొలగిపోతాయి.

భార్య, భర్తలకు వివాదాలు కోర్టు కేసులు ఉంటే స్వామికి 200 ఆకులతో ఇలా మాల ఇవ్వండి. అలాగే 108 అప్పాలు నైవేద్యం పెడితే స్వామి కృప ఉంటుంది. అలాగే ఏ ఇబ్బందులు ఉన్నా పరిష్కారం అవుతాయి. ఇంటిలో ఆంజనేయ విగ్రహం అరచేతి సైజులో ఉంచుకోవాలి. దానికి సింధూరం పూసి ఈ నాగవల్లీ దళాలతో పూజిస్తే వ్యాపారంలో వృద్ది ఉంటుంది.