రాఖీ ప్లేట్ అలంకరణలో ఈ వస్తువుల తప్పనిసరిగా ఉంచాల్సిందే? లేదంటే..

0
99

రాఖీ పండగ అంటే సోదరి, సోదరుల ప్రేమకు చిహ్నం. అలాంటి పండుగ జరుపుకోవడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ పండుగ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కడతారు. ఈ సందర్భంగా రాఖీ పండగ కోసం రెడీ చేసే ప్లేట్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాఖీ ప్లేట్‌ను తయారు చేసేసమయంలో ఆ ప్లేట్‌లో తప్పనిసరిగా ఏ వస్తువులు ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాఖీ ప్లేట్‌లో తప్పనిసరిగా కుంకుమ ఉండాలి. కుంకుమ లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. సోదరుని నుదుటిపై కుంకుమ పెట్టడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉంటాయని నమ్మకం. డబ్బుకి, తిండికి ఎప్పుడూ లోటుండదు.

రాఖీ లేకుండా పూజా ప్లేట్ అసంపూర్ణం. రాఖీ ప్లేట్‌లో రాఖీని పెట్టుకోండి. సోదరుల మణికట్టు మీద కట్టే ముందు రాఖీని దేవుడి పాదాల వద్ద ఉంచండి. మీ దైవానికి రాఖీ కట్టండి. రాఖీ అనేది సోదరి, సోదరుల మధ్య ప్రేమ, విడదీయరాని బంధానికి చిహ్నం.

హిందూ ఆరాధనలో అక్షతలకు ప్రత్యేక స్థానం ఉంది. బియ్యం గింజలను పసుపుని కలిపి తయారు చేసే వాటిని అక్షతలు అంటారు. వీటిని సోదరుని ఆశీర్వదిస్తూ వేస్తారు. ఇలా అక్షతలతో ఆశీర్వాదం తీసుకోవడం వలన దుర్గామాత, గణేశుడు, శ్రీరాముడు, శివుని ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.

రాఖీ ప్లేట్‌లో దీపం తప్పనిసరిగా పెట్టండి. దీపం వెదజల్లే వెలుగు జీవితంలో సానుకూలతను తెస్తుంది. శుభ, సంతోషకరమైన జీవితానికి ప్రారంభాన్ని సూచిస్తుంది. మీ సోదరుడికి రాఖీ కట్టే ముందు, సోదరుడికి హారతినివ్వండి. ఇది సోదరుడి ప్రతికూల ప్రభావాన్ని తొలగిస్తుంది.