మాల్దీవుల్లో ఎట్టి పరిస్దితిల్లో ఈ తప్పులు చేయకూడదు

These mistakes should not be made under any circumstances in the Maldives

0
128

పర్యాటకుల స్వర్గధామం అంటే ఫస్ట్ చెప్పేది మాల్దీవులే. నిత్యం కొన్ని వందల మంది మన భారత్ నుంచి వెళుతూ ఉంటారు. ఆసియాలోనే అతిచిన్న కంట్రీ కేవలం 5 నుంచి 6 లక్షల మంది జనం ఉంటారు. చాలా క్లీన్ గా ఉంటుంది. ఈ దేశానికి పర్యాటక ఆదాయం ఎక్కువ. అయితే ఈ కంట్రీలో ఎన్నో రూల్స్ కూడా అమలు చేస్తున్నారు.

మన ఇండియన్స్ ఇక్కడకు వీసా లేకుండా వెళ్లవచ్చు. అందుకే చాలా మంది ఈ ప్రాంతానికి ఎక్కువ హనీమూన్ కి వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ చేయకూడని పనులు (తప్పులు) ఏమిటో చూద్దాం.

1…మాల్దీవుల్లో రోడ్డు మీద హగ్ కిస్ ఇచ్చుకోవడం నేరం.
2. ఇక్కడ సిగరెట్లు కాల్చడం గుట్కా తినడం నేరం.
3.ఇక్కడకు ఆల్కహాల్ తీసుకురాకూడదు, సేవించకూడదు.
4. ఈ దేశంలో బికినీలు టూరిస్టులు మాత్రమే వేసుకోవాలి. అయితే అది కూడా రిసార్టుల్లో మాత్రమే బయటకు బికినీలతో రాకూడదు.
5.నేరుగా ఇక్కడ ఎవరూ ట్యాప్ వాటర్ తాగకూడదు.
5.ఇక్కడ స్మగుల్ ఐటెమ్స్ తీసుకురాకూడదు, అమ్మకూడదు.
6. పంది మాంసం అమ్మరు, తినకూడదు.
7. దేశంలో ప్రభుత్వానికి సంబంధించిన వారసత్వంగా వస్తున్న వస్తువులు, ప్రాంతాలు ప్రతీది కూడా గౌరవించాలి. వాటిని అగౌరపరచకూడదు డ్యామేజ్ చేయకూడదు.
08.. సముద్రం దగ్గర చెత్త వేయకూడదు. ప్లాస్టిక్ కూడా ఎక్కడా వేయకూడదు. చెత్త డబ్బాలు వాడాలి.
09. తాబేలు షెల్స్ ఏమీ అమ్మకూడదు. వాటిని గవర్నమెంట్ సేవ్ చేస్తుంది వీటిని సంరక్షిస్తున్నారు.
10. వ్యభిచారం ఇక్కడ నేరం. ఆ దేశ స్త్రీలని అగౌరపరిచినా దాడి చేసినా కఠిన శిక్షలు వేస్తారు.