తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ఇలా ఈజీగా పోందవచ్చు..

Thirumala Srivari Darshanam ticket can be obtained easily like this ..

0
108

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం మంచి అవకాశాన్ని కల్పించింది. ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి తెస్తూ ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది. ఏ.పి.ఎస్. ఆర్.టి.సి బస్సులలో తిరుమలకు విచ్చేయు ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ అమూల్యమైన అవకాశం కల్పించారు.

ఏ.పి.ఎస్. ఆర్.టి.సి బస్సులలో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతో పాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చును. ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు కలదు. తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకొనుటకు ప్రయాణికులకు ఆర్టీసీ సూపర్ వైజర్లు సహాయం చేస్తారు.

కావున తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ముందుగా ఆర్టీసీ బస్సులలో శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కోరారు. APSRTC ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతుంది. ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం కలదు. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కొరకు వచ్చు ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యంగా చెప్పుకోవచ్చు.