ఇక శిశుపాలుడు తనకు ఎక్కడా తిరుగులేదు అని భావిస్తాడు, అంతేకాదు ఎవరిని లెక్క చేయడు, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళతాడు, భోజ రాజుల్ని చంపి, వసుదేవుడు యజ్ఞాన్ని అడ్డుకుని అశ్వాన్ని దొంగలిస్తాడు, దానిని చంపేస్తాడు, ఇక కృష్ణుడు లేని సమయంలో దారుణంగా ద్వారకకు నిప్పంటిస్తాడు.
అక్కడ ప్రాంతం తగలబడుతుంది, ఇక రుక్మిణిని వివాహం చేసుకోవాలని చూశాడు. బభ్రు భార్యని అపహరించి తనదాన్ని చేసుకున్నాడు. ఇలా ఎన్నో తప్పులు చేశాడు, వంద తప్పుల వరకూ ఆ కృష్ణుడు అతనికి అవకాశం ఇవ్వడంతో ఏమీ చేయలేకపోయాడు.
ఈ సమయంలో ఓరోజు ధర్మరాజు తలపెట్టిన రాజసూయ యాగంలో భాగంగా చేధి దేశానికి వచ్చిన భీముడిని శిశుపాలుడు ఆదరించాడు. యాగానికి కోసం ధనం కూడా అందించాడు. యాగంలో తొలి అర్ఘ్యానికి శ్రీకృష్ణుడే అర్హుడని భీష్ముడు చెప్పడంతో శిశుపాలుడు ఆగ్రహించాడు. అతను ఎలా అర్హుడు అని విమర్శలు చేస్తాడు.
ఈ సమయంలో కృష్ణుడు సభనుద్దేశించి శిశుపాలుడి తల్లికిచ్చిన మాట ప్రకారం అతడి అపరాధాలను మన్నించాను… నేటితో వంద తప్పులు పూర్తయ్యాయి. ఈ మూర్ఖుడిని ఇప్పుడే సంహరిస్తానని చక్రం వేసి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. అలా శిశుపాలుడు హతుడు అయ్యాడు.