వర్షాకాలంలో ఫ్యామిలీ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే బెస్ట్ ప్లేస్..

0
100

మనలో చాలామంది ప్రకృతి అందాలను చూసేందుకు వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. పచ్చని ప్రకృతి రమణీయతలో పారవశ్యం పొందాలని ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా జలపాతాల వద్ద పర్యాటకుల సందడి అంతా ఇంతా కాదు. మరి ఈసారి వీకెండ్ కి ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లాలన్నా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలన్న ఇదే బెస్ట్ స్పాట్..

సాతారా జిల్లాలోని ఓ అందమైన ప్రాంతం జిల్లాకు 22 కి.మీ. దూరంలో ఉన్న ‘కాస్‌ పీఠభూమి’. ఒక అసాధారణమైన బయోస్పియర్, స్థానికులతోపాటు పర్యాటకులను ఇది విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ కేవలం ఆగస్టు, సెప్టెంబర్‌ మధ్యలో దాదాపు 300 రకాలకుపైగా వివిధ రకాలకు చెందిన రంగురంగుల పూలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కేవలం ఈ రెండు నెలల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి తండోపతండాలుగా జనం తరలి వస్తారు.
అదేవిధంగా మరెక్కడా చూడలేని రకరకాల పక్షులను ఈ ప్రాంతంలో చూసేందుకు ఇదే మంచి అవకాశం. ఈ ప్రకృతిని ఆస్వా దించిన పర్యాటకులకు ఈ ప్రదేశం తమ జీవితంలో ఒక మధురానుభూతిగా నిలిచిపోతుంది. ఇక్కడికి వచ్చిన సందర్శకులు పూలను, మొక్కలను తెంచకపోవడం మరో విశేషం. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ వింత లోకాన్ని చూడడానికి పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు.