ఇది కదా తల్లి ప్రేమ అంటే..బిడ్డ కోసం ప్రాణత్యాగం చేసిన తల్లి జింక (వీడియో)

0
106

ఈ సృష్టిలో తల్లిని ప్రేమను మించింది మరొకటి లేదు. బంధువులు, మిత్రులందరి ప్రేమకంటే తల్లి ప్రేమ చాలా గొప్పది అంతేకాదు ప్రధానమైనది కూడా. అందుకే తల్లిని మించిన దైవము లేదంటారు. మనిషి అయినా..జంతువు అయినా ఏ ప్రాణి అయినా మాతృత్వానికి అతీతమేమీ కాదు.

ప్రతి ప్రాణిలోనూ మాతృమూర్తీ భవిస్తుంది. తన పిల్లలకు ఆపదవస్తే..తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తుంది. మాతృ ప్రేమను మించింది ఈ లోకంలో మారేదీలేదని ఓ జింక నిరూపించింది.

నదిలో ఈత కొడుతున్న జింక పిల్లను తినడానికి వేగంగా వస్తున్న మొసలిని తల్లి జింక గమనించడంతో..ఆలస్యం చేయకుండా తన బిడ్డను కాపాడుకునేందుకు నీటిలోకి దూకి మొసలికి ఆహారంగా మారి ప్రాణత్యాగం చేసింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సోనాల్ గోయెల్ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి

https://www.facebook.com/alltimereport/videos/3023177108012677