ఈ గుమ్మడికాయ వెరీ స్పెషల్..ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు అవుట్!

0
106

మామూలుగా గుమ్మడికాయ ధర రూ.200 లేదా 300 ఉంటుంది. కానీ ఈ భారీ గుమ్మడికాయ ధర తెలిస్తే షాకవుతారు. వెయ్యి, రెండు వేలు కాదు అక్షరాలా 47 వేల రూపాయలు వెచ్చించి దీనిని కొనుక్కున్నారు. అయితే ఈ గుమ్మడికాయ ఎందుకంత స్పెషల్? అంత ధర ఎందుకు పలికింది అనేది ఇప్పుడు చూద్దాం..

కేరళలోని ఇడుక్కిలోని కొండ ప్రాంతంలో చెమ్మన్నార్​ అనే గ్రామం ఉంది. అక్కడ ఓనం పండగ సందర్భంగా బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో 5 కిలోల గుమ్మడికాయ రూ.47 వేలకు దక్కించుకున్నాడో వ్యక్తి. సాధారణంగా ఈ వేలంలో పొట్టేళ్లు, కోళ్లు ఇంత ధర పలుకుతాయి. కానీ ఈ సారి గుమ్మడికాయ భారీ ధర పలకడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.