రైలు ప్రయాణం చేసే వారు ఇది తెలుసుకోండి – ఈ తప్పులు చేస్తే శిక్షలు తప్పవు

Those who travel by train should know this

0
110

రైలులో ప్రయాణం చేసే వారు రైల్వే శాఖ చెప్పిన కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా కొన్ని విషయాలు రైల్వే శాఖ కూడా పడే పదే చెబుతుంది. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే జరిమానా మాత్రమే కాదు జైలుకు కూడా పంపిస్తారు. ఇక కొంద‌రు టికెట్ బుక్ చేసుకున్న త‌ర్వాత ఒకవేళ వారు ఏదైనా కారణంతో ప్రయాణం చేయకపోతే ఆ టికెట్ పై వేరొకరిని తీసుకువెళదాం అనుకుంటారు ఇది చ‌ట్ట‌రిత్యానేరం.

ఎల్లప్పుడూ సరైన టిక్కెట్లతో మాత్రమే ప్రయాణించాలని రైల్వేశాఖ చెబుతోంది. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తు ఉంచుకోవాలి. కుటుంబానికి సంబంధించి మీ కుటుంబ సభ్యుడు టిక్కెట్ పై మీకు రక్త సంబంధీకులై ఉంటే ప్రయాణం చేయవచ్చు. ఉదాహరణకు తల్లిదండ్రులు, తోబుట్టువులు, జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరిట టికెట్ ఉంటే మీరు వారి టికెట్ పై సులువుగా ప్రయాణించవచ్చు.

అయితే దీనికి సంబంధించి ఓ రూల్ మీరు పాటించాలి ఏమిటి అంటే? ఎవరి టికెట్ పై మీరు ప్రయాణం చేస్తున్నారో వారి పేరుని మార్చి మీ పేరును అందులో చేర్చుకోవాలి .రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు అవసరమైన పత్రాలతో లెటర్ హెడ్ పై ఇనిస్టిట్యూట్ హెడ్ రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకుంటే రైల్వే అధికారులు పరిశీలిస్తారు. ఈ విధంగా పేరు న‌మోదుచేసుకుని మాత్ర‌మే ప్ర‌యాణం చేయాలి.