ఏపీకి అకాల వర్షాల ముప్పు పొంచి ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుడం కొనసాగుతోంది. తమిళనాడులోని నాగపట్నం నుంచి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతం కావడంతో 13 కి.మీల వేగంతో ఉత్తర దిశగా వాయుగుడం కదులుతోంది.
ఈ వాయుగుండం సాయంత్రం వరకు తమిళనాడు తీరానికి మరింత దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా తమిళనాడు, కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వ్యాపించనున్నాయి. వాయుగుడం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాదు తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో మత్య్సకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
కాగా గత ఏడాది సంభవించిన వర్షాలు వరదల కారణంగా నాలుగు జిల్లాలు తీవ్రంగా నష్టపోగా..ప్రస్తుతం మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షసూచన నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల పంటలు తీసే దశలో ఉండటం వారిని టెన్షన్ పడుతున్నారు.