రిలయన్స్ సంస్థ ఓనర్ ముఖేశ్ అంబానీకి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కేవలం ముఖేశ్ అంబానీనే కాకుండా తన ఫ్యామిలీని కూడా హత మారుస్తామంటూ బెదిరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రిలయన్స్ హాస్పిటల్‌కు ఇప్పటికే మూడుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని ముంబై పోలీసులకు రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ఫిర్యాదు నమోదు చేసింది. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేసి ఒకర్ని అరెస్టు చేశారు.