మూడేళ్లు ప్రేమించాడు… పెళ్లి అంటే మొహం చేటేశాడు… మనస్తాపంతో యువతి ఉరి…

మూడేళ్లు ప్రేమించాడు... పెళ్లి అంటే మొహం చేటేశాడు... మనస్తాపంతో యువతి ఉరి...

0
88

ఈసంఘటన మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం ప్రశాంత్ నగర్ లో జరిగింది… స్థానింగా ఒక మహిళకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.. గతంలో భర్త చనిపోవడంతో ఆ మహిళ తన ముగ్గురు పిల్లలను కష్టపడి పెంచి పెద్ద చేసింది… పెద్ద కుమార్తెకు వివాహం చేసింది.. ఈ క్రమంలో రెండో కుమార్తె ఇంటినుంచి ఉదయం బయటకు వెళ్లింది..

ఎంత సేపు అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి అలాగే చిన్న కుమార్తె ఆమెను వెతికేందుకు వెళ్లారు… ఒక పాత ఇంట్లో ఆమెఉరి వేసుకుని కనిపించింది… దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు… తన కూతురు చావుకు కారణం ప్రేమ వ్యవహారమే ఆని ఆమె వాపోయింది…

స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి తన కూతురు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని పెళ్లి విషయం ఎత్తితే ఆ వ్యక్తి దాట వేస్తున్నాడని దీంతో మనస్తాపంతో తన కూతురు ఉరి వేసుకుందని తల్లి ఫిర్యాదు చేసింది… ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…