ఏపీలో రోజు రోజుకూ కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఈ ఎఫెక్ట్ ప్రముఖ పుణ్యక్షేత్రాలపైనా పడింది. ఇప్పటికే టీటీడీ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇక శ్రీశైల మలన్న స్వామిని దర్శించుకోవాలన్నా కేవలం ఆన్ లైన్ లోనే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి పూర్తిస్థాయిలో ఆన్ లైన్ విధానం అమలు చేస్తున్నారు. ఇకపై ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకోకుండా ఆలయానికి వచ్చే భక్తులను ఎట్టి పరిస్థితుల్లో కొండపైకి అనుమతించరు. ఇందులో భాగంగా నేటి నుంచి (జనవరి25) అన్ని రకాల దర్శనం టికెట్లను ఆన్ లైన్ లోనే పొందేలా ఆలయాధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.
ఈ క్రమంలో శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు ఉచిత దర్శనంతో పాటు రూ.150, రూ.300 దర్శనం టికెట్లు, ఆర్జిత సేవల టిక్కెట్లు కూడా ఆన్ లైన్ ద్వారానే పొందాల్సి ఉం టుంది. టికెట్ బుక్ చేసుకోవడానికి, దర్శనానికి సంబంధించి అదనపు సమాచారం కోసం భక్తులు తమ అధికారిక వెబ్ సైట్ ను చూడాలని ఆలయాధికారులు సూచించారు. కాగా మల్లన్న స్వామి దర్శనం కోసం వచ్చే వారు కొవిడ్ వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రం లేదా కొవిడ్ నెగెటివ్ రిపోర్టును కూడా ఆన్లైన్లోనే సమర్పించాలని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు.