అమ్మాయితో టిక్ టాక్ చేశాడు కోపంతో ఆమె సోదరుడు ఏం చేశాడంటే

అమ్మాయితో టిక్ టాక్ చేశాడు కోపంతో ఆమె సోదరుడు ఏం చేశాడంటే

0
95

టిక్టాక్ వీడియోలు సరదా కోసం చేస్తున్నా వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి, ఈ వీడియోలు చేయకూడదు
అని తల్లిదండ్రులు చెబుతున్నా వారిపై దాడులకి కూడా పాల్పడుతున్నారు కొందరు పిల్లలు, అయితే టిక్ టాక్ వల్ల భార్య భర్తలకు కూడా అనేక గొడవలు వచ్చిన సంఘటనలు ఉన్నాయి, టిక్ టాక్ వదలలేక భర్తకి విడాకులు ఇస్తున్న భార్యలు ఉన్నారట.

పద్నాలుగేళ్ల ఓ అమ్మాయితో ఓ మైనర్ బాలుడు టిక్టాక్ వీడియో తీశాడు… ఆ వీడియోని ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు చూశారు. అంతే, ఆ బాలుడిని పట్టుకుని కొట్టి నగ్నంగా ఊరేగించారు. ఇది వినడానికి చాలా దారుణంగా ఉంది, అసలు ఇద్దరూ మైనర్లే , పైగా తెలిసిన కుటుంబాల వారే, అయినా సరే ఆ బాబుని నగ్నంగా ఊరేగించడంతో పోలీసులకి ఈ విషయం చేరింది..

జైపూర్లో ఈ నెల 7న ఈ దారుణం చోటు చేసుకుంది అని తెలుస్తోంది. ముందు వారిద్దరూ ఈ వీడియో చేయడంతో ఈ అమ్మాయి సోదరుడు చూశాడు ..కోపంతో తండ్రికి చెప్పాడు.. దీంతో వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆ యువకుడ్ని ఊరేగించారు , ఈ విషయం పై పోలీసులు సీరియస్ అయి వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు, పాపం టిక్ టాక్ చివరకు ఇంత స్దితి ఆ బాలుడికి తీసుకువచ్చింది.