Tik Tok ఓ దొంగను పట్టించింది ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Tik Tok ఓ దొంగను పట్టించింది ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు

0
123

టిక్ టాక్ ఈ రోజుల్లో చాలా మంది వాడుతున్నారు.. దీని ద్వారా సినిమాలో అవకాశాలు సంపాదించిన వారు ఉన్నారు, వారి టాలెంట్ ద్వారా పైకి వచ్చిన వారు ఉన్నారు, అయితే టిక్ టాక్ ఈసారి ఓ దొంగను పట్టించింది, ఎలాగో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

అసోంలోని జోర్హత్కు చెందిన సుమి కలితా అనే యువతి ఓ వృద్ధురాలికి కేర్ టేకర్గా పనిచేసింది. ఓ వ్యక్తి తన తల్లికి అన్నీ పనులు చేయాలి అని ఆమెని పనిలో పెట్టుకున్నాడు.. కొన్ని రోజులు బాగానే చేసింది, తర్వాత తన దగ్గర ఉన్న దొంగ బుద్ది బయటపెట్టింది, ఇంటిలో ఎవరూ లేని సమయంలో బంగారం వెండి వస్తువులు నగదు బీరువాలో చీరలు

అన్నీ కూడా ఇంటికి తీసుకువెళ్లేది, వారు ధనవంతులు కావడంతో పెద్దగా ఆ వస్తువులు నిత్యం చూసుకోలేదు, ఇలా మూడు నెలలు పని చేసి ఆమె మానేసింది, తర్వాత నగలు చీరలు కనిపించలేదు, కొద్ది రోజులు ఇక వేరే పేరుమీద టిక్ టాక్ అకౌంట్ క్రియేట్ చేసి, వీడియోలు పెట్టింది, ఇవి వారికి కనిపించాయి, ఆ వీడియోలో వేసుకున్న ఆభరణాలు చీరలు ఇక్కడ దొంగిలించినవే అని తెలుసుకుని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఆమె మాత్రం ఇంకా దొరకాల్సి ఉంది.