తిరుమల భక్తులకు రైల్వేశాఖ తీపికబురు..మరిన్ని ప్రత్యేక రైళ్లు..వివరాలివే..

0
103

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో జరగనున్నాయి. దీంతో ఈసారి పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తిరుమల వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో రోజూ లక్ష మందిపైగా భక్తులు దర్శనానికి వస్తుంటారు. గరుడసేవ రోజున ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుంది.

ఇక తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లొచ్చే భక్తులకు రైల్వే శాఖ మరో తీపికబురు అందించింది. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వేమరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నాలుగు సర్వీసుల ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట్ మీదుగా నడుస్తాయి. ప్రత్యేక రైలు (నెం.07469) ఆగస్టు 11, 13 తేదీల్లో సాయంత్రం 05.50 గం.లకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.20 గం.లకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

అలాగే ప్రత్యేక రైలు (నెం.07470) ఆగస్టు 12, 14 తేదీల్లో రాత్రి 08.15 గం.లకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.20 గం.లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, సెకండ్ జనరల్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నాయి.