తిరుమల: సీనియర్ సిటిజన్స్ కి శుభవార్త..ఉచిత దర్శనాలు..ఏ రోజుల్లో తెలుసా?

0
176
ప్రతి హిందువు కల కలియుగదైవం కొలువైన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని. అయితే శ్రీవారి దర్శనానికి వెళ్ళడానికి అరవై ఏళ్ళు పైబడిన వయోవృద్ధులకు ( సీనియర్ సిటిజన్స్) కు టీటీడీ ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనానికి వారికి కల్పిస్తుంది. టి.టి.డి వారి దృష్టిలో సీనియర్ సిటిజన్స్ అంటే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే.
శ్రీవారి ఉచిత దర్శనానికి సీనియర్ సిటిజన్స్ కు రెండు స్లాట్ లు ఉంటాయి. మొదటి స్లాట్ ఉదయం 10-00 గంటలకు. రెండవ స్లాట్ మధ్యాహ్నం 3-00 గంటలకు. ఈ స్లాట్లలో దర్శనానికి వెళ్లిన సీనియర్ సిటిజన్స్‌కి సుమారుగా గంట లేదా గంటన్నర సమయంలోనే శ్రీవారి దర్శనం పూర్తి అవటానికి అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్స్‌కి సంబంధించిన టోకెన్లు పొందటం కోసం ప్రతి ఒక్కరూ తమ తమ ఆధార్ కార్డు (ఫోటోతో వున్న వయసు నిర్ధారణ పత్రం) ఒరిజినల్ తప్పనిసరిగా “S-1 counter” వద్ద చూపించాల్సి వుంటుంది. ఈ కౌంటర్ ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద గోడ పక్కనే ఉంటుంది. మెట్లు ఎక్కాల్సిన పని లేదు. మంచి సీట్లు ఏర్పాటు చేయబడి వుంటాయి. దర్శనం కోసం వెళ్లిన వృద్ధులకు సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఉచితంగా ఇస్తారు. అక్కడే వారికి రూ. 20/-లకు రెండు లడ్డు టోకెన్లు ఇస్తారు.
కౌంటరు నుండి గుడికి-గుడి నుండి కౌంటరుకు బ్యాటరీ కారులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. అంతేకాదు వృద్ధులకు ఇచ్చిన దర్శన సమయంలో మిగతా అన్ని క్యూ లు నిలిపి వేయబడతాయి. అయితే ఈ దర్శనాన్ని వారంలో రెండు రోజులు మాత్రమే కల్పిస్తున్నారు. ప్రతి బుధవారం మరియు శుక్రవారం ఉదయం మాత్రమే దర్శనం ఉంటుంది.