తిరుమలకు వెళితే కచ్చితంగా ఆ లడ్డూ ప్రసాదం తెచ్చావా అంటారు, ఆ స్వామి ప్రసాదాల్లో లడ్డూ వడకు ఎంతో ప్రాముఖ్యత ఉంది, రుచి కూడా అమోఘం అనే చెప్పాలి, అయితే స్వామిని దర్శించుకుని వచ్చిన తర్వాత ఇక భక్తులకి ఎవరికి ఎన్ని లడ్డూలు కావాలి అంటే అన్నీ లడ్డూలు ఇస్తున్నారు.
ఇక కొండపై పర్యావరణానికి హానికలిగించే ప్లాస్టిక్ వాడకం మొత్తం ఆపేశారు, అయితే ప్రసాదాలు తీసుకువెళ్లడానికి కవర్లు లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు.. ఈ సమయంలో జనపనార బ్యాగులు ఇవ్వనున్నారు, అంతేకాదు ఇవి పెద్ద సంచులు కూడా అమ్ముతున్నారు, ఇవి చాలా బాగున్నాయి అంటున్నారు.
ఇక ఈ లడ్డూలు కూడా ఇందులో పెడితే పాడవకుండా ఉంటాయి, అంతేకాదు నెయ్యి కూడా పీల్చవు అంటున్నారు అధికారులు. మరి ఆ కొత్త సంచుల ధరలు చూద్దాం.
ఐదు లడ్డులు పట్టే బ్యాగ్ ధర రూ.25
10 లడ్డూలు పట్టే బ్యాగ్ ధర రూ.30
15 లడ్డూలు పట్టే బ్యాగ్ ధర రూ. 35
25 లడ్డూలు పట్టే బ్యాగ్ ధర రూ.55