ఈ రోజు మార్కెట్లో బంగారం వెండి రేట్లు ఇవే

Today Gold And Silver Rates

0
112
Gold

నిన్న మార్కెట్లో పెరిగిన బంగారం ధర నేడు సాధారణంగానే ఉంది. ఎలాంటి పెరుగుదల, తగ్గుదల లేదు. ఇక బంగారం అమ్మకాలు కూడా నిన్న భారీగా పెరిగాయి. ఇక పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ సడలింపు వల్ల బంగారం అమ్మకాలు పెరుగుతున్నాయి.మరి పుత్తడి, వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర నిలకడగానే కొనసాగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఏ మార్పు లేదు. రూ.50,070 దగ్గర ట్రేడ్ అవుతోంది.

అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.45,900 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక బంగారం ధర ఇలా ఉంది, మరి వెండి రేట్లు చూస్తే వెండి ధర తగ్గింది. కిలోకి 200 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,200కు తగ్గింది. ఇక మార్కెట్లో వెండి, బంగారం ధరలు వచ్చే రోజుల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు బులియన్ వ్యాపారులు.