ఓ పక్క కరోనా సమయం, చాలా చోట్ల లాక్ డౌన్ అమలులో ఉన్నా, బంగారం ధర మాత్రం తగ్గడం లేదు పెరుగుతూనే ఉంది.. స్టాక్స్ లో పెట్టుబడులు తగ్గడంతో చాలా మంది బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు, ఇంటర్నేషనల్ గా గోల్డ్ ధర పరుగులు పెడుతోంది భారత్ లో కూడా బంగారం ధర పెరుగుతోంది. గత మూడు రోజులుగా ఆకాశాన్ని అంటుతున్నాయి పుత్తడి ధరలు మరి ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగింది..రూ.50,070కు ట్రేడ్ అవుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.90 పెరుగుదలతో రూ.45,900కు అమ్మకాలు చేస్తున్నారు. ఆర్నమెంట్ బంగారం అమ్మకాలు రెండు రోజులుగా 8 శాతం మేర పెరిగాయి.
బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా పరుగులు పెట్టింది. వెండి ధర కిలోకి రూ.400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.72,000కు ట్రేడ్ అవుతోంది. ఇక వచ్చే రోజుల్లో పుత్తడి ధరలు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.