ఫ్లాష్ న్యూస్ …రేపు ముగ్గురికి మాత్రమే ఉరి నిర్భయదోషులు ఎత్తులు

ఫ్లాష్ న్యూస్ ...రేపు ముగ్గురికి మాత్రమే ఉరి నిర్భయదోషులు ఎత్తులు

0
90

నిర్భయ కేసు రోజురోజుకో మలుపు తిరుగుతుంది. దోషులు తప్పించుకునేందుకు ఉరి అంటే భయంతో అన్ని ఎత్తులు వేస్తున్నారు,
నలుగురు దోషుల క్షమాభిక్ష పిటీషన్ను రాష్ట్రపతి మూడు రోజుల కిందే తిరస్కరించాడు. దాంతో ఆ దోషులను ఫిబ్రవరి 1న ఉరి తీయడం దాదాపు ఖాయమనే అనుకున్నారు. కాని ఈలోపు రాష్ట్రపతి క్షమాభిక్షను కోరుతూ వినయ్ శర్మ పిటీషన్ను దాఖలు చేశాడు.

ఇక కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.. ఈ సమయంలో ఇలా పిటిషన్ రావడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది, చివరి వరకూ ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి ఎత్తులు వేస్తున్నారు అని అంటున్నారు.. వినయ్ శర్మ పిటీషన్ పెండింగ్లో ఉన్నందున అతని ఉరి శిక్ష వాయిదా పడుతుందని తీహార్ జైలు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్ అహ్మద్ అన్నారు.

ఇందులో వేరే ఉద్దేశమేది లేదని ఆయన అన్నారు. మిగిలిన ముగ్గురిని అనుకున్న సమయానికి ఉరితీస్తాము అని చెబుతున్నారు, అయితే సాయంత్రంలోపు అతని పిటీషన్ కూడా కొట్టేస్తే అతను కూడా ఉరికంబం ఎక్కాల్సిందే అంటున్నారు.