మన జీవన విధానంలో ప్రకృతి ఒక భాగం అనే చెప్పాలి, పక్షులు చెట్లు జంతువులు ఇలా వాటిని కూడా పూజిస్తూ ముందుకు వెళతాం. అయితే నదులని కూడా దేవతలుగా పూజిస్తాం. అందుకే అనేక పండుగలు సంప్రదాయాలు ఉంటాయి. గంగానదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. గంగను భగీరధుడు భూమికి తీసుకొచ్చాడు అనేది తెలిసిందే.
అయితే ఇలా గంగను తీసుకువచ్చిన రోజు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష దశమి అంటారు.స్మృతి కౌస్తుభం అనే గ్రంథం లో కూడా పెద్దలు వివరించారు.అందుకే ఈరోజును దశపాపహర దశమిగా చెబుతారు. ఈ రోజు పూజ చేస్తే పదిరకాల పాపాలు తొలగిపోతాయి.
అయితే తెలియక చేసిన పాపాలు కచ్చితంగా ఈరోజు శివుడ్ని పూజిస్తే తొలగిపోతాయి.
1. ఇతరులతో పరుషంగా మాట్లాడి దూషించడం 2.అబద్ధాలు చెప్పటం 3. ఒకరి గురించి చెడుగా మాట్లాడటం 4.సమాజం వినలేని మాటలు మన నోటి నుంచి అనడం 5. స్నేహితుడికి నీ దగ్గర డబ్బు ఉన్నా ఇవ్వకపోవడం 6. బంగారు వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం 7.హింసను చేయడం 8. గోవులని కొట్టడం 9. నీ దగ్గర ధాన్యరాశి ఉన్నా ఇవ్వకపోవడం 10. పక్షులకి నిలువ నీడలేకుండా చేయడం అందుకే ఈ రోజు గంగా నదిలో స్నానం చేస్తే గొప్ప విశేషం. కాశీ లోని దశాశ్వమేధ ఘాట్ దీనికి ప్రసిద్ధి. ముందు గంగాదేవిని ఆ తర్వాత శివుడ్ని పార్వతిని పూజిస్తే సకలపాపాలు పోతాయి.