మీరు టూత్ బ్రష్ కొనేముందు ఈ విషయాలు గమనించండి

మీరు టూత్ బ్రష్ కొనేముందు ఈ విషయాలు గమనించండి

0
93

ఈ ప్రపంచంలో పళ్ల సమస్యలు చాలా మందికి ఉంటాయి, ముఖ్యంగా సరిగ్గా పళ్లు తోముకోపోవడం ఆహరం తిన్నాక పుక్కలించకపోవడం వల్ల పళ్ల సమస్యలు ఎక్కువ వస్తాయి, అయితే సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం కూడా ఓ ప్రధాన కారణం అంటున్నారు వైద్యులు.

ముఖ్యంగా మనం పళ్లు తోముకునే బ్రష్ ల విషయంలో ఆచితూచి అవి కొనుక్కోవాలి, ధర తక్కువ కదా అని భావిస్తే తర్వాత పళ్ల డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే, మీ నోటీ సైజుని బట్టీ బ్రష్ కొనుక్కోవాలి,స్ట్రాంగ్ టీత్ వారు స్ట్రాంగ్ బ్రిసిల్ ఉన్న బ్రష్ కొనుక్కోండి.

చిగురు సమస్యలు ఉంటే వారు స్మూత్ గా ఉన్న బ్రష్ వాడాలి, కొన్ని బ్రష్ లకు బ్రసెల్స్ మెత్తగా, సున్నితంగా ఉండవు. చాలా హార్డ్గా ఉంటే చిగుళ్లు దెబ్బతింటాయి. బ్రష్ను నోట్లోకి పెట్టుకోగానే పళ్లు తోమడానికి సులువుగా ఉండాలి. ఇక డిజైన్ల బ్రష్ లు వద్దు , అంతేకాదు నెలకి ఓసారి కచ్చితంగా మీ బ్రష్ మార్చుకోవాలి, పళ్లు కడిగిన వెంటనే మీ బ్రష్ కి క్యాప్ పెట్టాలి, అంతేకాదు వేడి నీటితో దానిని కడిగి బ్రష్ చేసుకుంటే క్రిములు ఉండవు.