మన ప్రపంచంలో ఎన్నో నగరాలు ఉన్నాయి.. అక్కడ లైఫ్ కాస్ట్ లీగా కూడా ఉంటుంది, కొన్ని చోట్ల సాధారణ లైఫ్ ఉన్నా మరికొన్ని చోట్ల లగ్జరీ లైఫ్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి, ఇక ఇలాంటి ఖరీదైన నగరాల్లో సాధారణ వ్యక్తులు ఉండటం చాలా కష్టం.. ఇక సాధారణ నగరాల్లో ఉండే ఖర్చుకి పది ఇంతలు ఖర్చు ఇక్కడ ఉంటుంది, పేరుమోసిన ధనికులు వ్యాపారవేత్తలు మాత్రమే ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటారు.
ప్రపంచంలో ఖరీదైన నగరాలేవి అనేది తాజాగా ఓ సర్వేసంస్ధ సర్వే చేసింది.. వరల్డ్ లో హాంకాంగ్ పారిస్ జూరిచ్ అత్యంత ఖరీదైన నగరాలుగా నిర్ధారించారు. సింగపూర్ ఒసాకా టెల్ అవీవ్ న్యూయార్క్ తర్వాత ప్లేస్ లో నిలిచాయి.. ఇక మరి చౌకైన నగరం ఏది అంటే సిరియా రాజధాని డమస్కస్. ఆ తర్వాత ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కంట్ లుసాకా కారకాస్ ఆల్మటీ నగరాలు.
ఈ సర్వే చూసిన చాలా మంది ఈ నగరాల్లో నివశించాలి అంటే కోట్లు కావాలేమో అంటున్నారు. అయితే కొన్ని నగరాలు ముందు ప్లేస్ లో ఉంటాయి అని భావించారు.. కాని ఆ నగరాల్లో ఇతర దేశాల వారు కరోనా వల్ల తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు దీంతో రియల్టీ హోటల్ రంగం దెబ్బతింది.. దీంతో అవి చౌకైన నగరాలుగా మారాయి.