బ్రేకింగ్ న్యూస్ – ఘోర రైలు ప్ర‌మాదం 19 మంది మృతి మ‌రో విషాదం

బ్రేకింగ్ న్యూస్ - ఘోర రైలు ప్ర‌మాదం 19 మంది మృతి మ‌రో విషాదం

0
110

2020 అత్యంత దారుణంగా న‌డుస్తున్న సంవ‌త్స‌రం అనే చెప్పాలి, రోజుకో విషాదం జ‌రుగుతోంది, క‌రోనాతో ఇబ్బంది ప‌డుతున్న వేళ‌, విశాఖ‌లో స్టెరీన్ అనే విషవాయువు లీకై 12 మంది మ‌ర‌ణించారు, నేడు మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈరోజు ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. దీంతో అక్క‌డ వ‌ల‌స‌కూలీలు 19 మంది మ‌ర‌ణించారు.

ఈ ప్రాంతంలోని కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 19 మంది వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా అక్క‌డ ట్రాక్ పై వారి శరీరాలు చిద్ర‌మై క‌నిపించాయి.

ఇక ఇక్క‌డే మ‌రో 50 మంది వ‌లస కూలీలు గాయ‌ప‌డ్డారు, ఇక్క‌డ చిన్నారులు మ‌హిళ‌లు కూడా ఉన్నారు.
క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. తెల్ల‌వారుజామున 5 గంట‌ల‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగింది అని తెలిపారు.