పోలీస్ ఉద్యోగాలకు మాకు అవకాశం ఇవ్వాలంటున్న ట్రాన్స్ జెండర్స్..

0
118

తెలంగాణాలో ఉద్యోగాల జాతర మొదలయిపోయింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు చక్కని అవకాశాలు కల్పిస్తుంది. తెలంగాణాలో ఇప్పటికే పోలీస్ , గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తుంది. కానీ ఈ అవకాశాలు కేవలం పురుషులకు, మహిళలకు మాత్రమే అవకాశం ఉండడంతో ట్రాన్స్ జెండర్స్ మాకు కూడా పోలీస్ ఉద్యోగాలకు అవకాశం కల్పించాలంటూ హైదరాబాద్ డిజీపీ కార్యాలయంకు వద్దకు చేరి వేడుకున్నారు.

ట్రాన్స్ జెండర్స్ కోటా కూడా ఇవ్వాలని డిజీపీ కార్యాలయం వద్ద విజ్ఞప్తి చేసుకున్నారు. ట్రాన్స్ జెండర్స్ పోలీస్ ఉద్యోగాలు సాదించగలరని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో ట్రాన్స్ జెండర్స్ పోలీస్ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు పోరాటం ఆపమని పేర్కొన్నారు. ప్రస్తుతం వారు డిజీపీ కార్యాలయం వద్ద అవకాశాలు కల్పించాలంటూ తీవ్రంగా డిమాండ్ చేస్తున్న క్రమంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి..!