రెవెన్యూ అధికారులను అడ్డుకున్న గిరిజన రైతులు..తీవ్ర ఉద్రిక్తత

0
98

తెలంగాణ: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రామచంద్రపురం తండా గ్రామంలో అధికారులకు , రైతులకు తగాదా ఏర్పడింది. రైల్వే మార్గం కోసం సర్వేకు వచ్చిన ఎమ్మార్వో, ఆర్ఐలను రైతులు అడ్డుకున్నారు.

గతంలో ఎన్నో భూములు నాగార్జున సిమెంట్ ప్రైవేటు లిమిటెడ్ యాజమాన్యానికి ఇచ్చి ఉన్నామని  రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. ఇక ఉన్న ఈ కాస్త భూమిని ఇవ్వలేమంటూ బాధితులు బోరున విలపించారు.

ఈ విషయంపై గ్రామ పెద్దలు లీలాధర్ మణికంఠ నాయక్ మాట్లాడుతూ..గతంలో కూడా ఎమ్మార్వో వచ్చి రైల్వే మార్గం కోసం సర్వే చూశారు. ఆ సమయంలో రైతులందరం ఏకమై అధికారులను వెను తిరిగేలా చేశామని గుర్తు చేసారు. ఇక్కడ నష్టపోయేది గిరిజన రైతులని తెలిసిన కూడా అధికారులు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

అలాగే నోటీసులు కూడా ఇవ్వకుండా సర్వే కోసం పట్టా భూములపై రావటమేమిటని సూటిగా ప్రశ్నించారు. మా పట్టా భూములను మేము వదులుకోలేమని, గిరిజనుల భూములు లాక్కొవాలని ప్రయత్నాలు చేస్తే ఊరుకోనే పరిస్థితి లేదని, ఈ సందర్భంగా అధికారులకు తేల్చి చెప్పినట్లు పేర్కొన్నారు.

అలాగే గిరిజన రైతులు చెప్పేది వినకుండా, వినతి పత్రం తీసుకోకుండా నిరాకరించారని తెలిపారు. అంతేకాకుండా ఏం మాట్లాడ్తున్నావ్ అని గిరిజన రైతులపై మఠంపల్లి తహసీల్దార్ మండిపడ్డారు. గిరిజన రైతుల పట్టా సాగు భూములపై వచ్చి గిరిజన రైతులపై ఎవడివి అని మట్టంపల్లి తహసీల్దార్ వ్యాఖ్యలు చేయడం మరింత దుమారం రేపాయి.