టీఎస్‌ ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్‌..పూర్తి వివరాలివే..

TS Amset-2021 Final Counseling..Full Details

0
93

ఇంజి‌నీ‌రింగ్‌ కోర్సుల్లో ప్రవే‌శాల కోసం ఎంసెట్‌ తుది‌వి‌డ‌త‌తో‌ పాటు స్పెషల్‌ రౌండ్‌ కౌన్సె‌లింగ్‌ షెడ్యూల్‌ మంగ‌ళ‌వారం విడు‌ద‌లైంది. ఇప్ప‌టికే తొలి‌వి‌డత కౌన్సె‌లింగ్‌ పూర్తి‌కాగా, మిగి‌లిన సీట్లను ఈ రెండో‌ వి‌డత (తు‌ది‌వి‌డ‌త) లో భర్తీ చేయ‌ను‌న్నారు. ఈ నెల 6 నుంచి కౌన్సె‌లింగ్‌ ప్రారంభం కాను‌న్నది. 20 నుంచి స్పెషల్‌ రౌండ్‌ కౌన్సె‌లింగ్‌ మొద‌లు‌కా‌ను‌న్నది. ఎంసెట్‌ తొలి‌వి‌డత సీట్ల రద్దు గడు‌వును ఈ నెల ఐదో‌ తేదీ వరకు పొడి‌గిం‌చారు.

ఇంజి‌నీ‌రింగ్‌, బీ ఫార్మసీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 25న స్పాట్‌ అడ్మి‌షన్లు నిర్వ‌హిం‌చ‌ను‌న్నారు. మూడు‌ వి‌డ‌తల్లో భర్తీ‌కాని సీట్లను స్పాట్‌ ద్వారా యాజ‌మా‌న్యాలే భర్తీ చేసు‌కొనే అవ‌కాశం కల్పిం‌చారు. ఇందుకు సంబం‌ధిం‌చిన మార్గ‌ద‌ర్శ‌కా‌లను tseamcet.nic.in వెబ్‌‌సై‌ట్‌లో పెట్టారు.

తుదివిడత:

ఆన్‌లైన్ లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, హెల్ప్ లైన్ సెంటర్ ఎంపిక కోసం స్లాట్ బుకింగ్, మొదటి దశలో హాజరుకాని అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాల్సిన తేదీ, సమయం – నవంబర్ 6 నుంచి నవంబర్ 7 వరకు

తుది దశలో ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ – నవంబర్ 8

సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనంతరం వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – నవంబర్ 6 నుంచి నవంబర్ 9 వరకు

ఆప్షన్స్ ఫ్రీజింగ్ సమయం – నవంబర్ 9

తుది విడత సీట్లు కేటాయింపు – నవంబర్ 12

వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – నవంబర్ 12 నుంచి నవంబర్ 15 వరకు

కేటాయించిన కళాశాలలో రిపోర్టింగ్ – నవంబర్ 12 నుంచి నవంబర్ 16 వరకు

స్పెషల్ రౌండ్ :

వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – నవంబర్ 20 నుంచి నవంబర్ 21 వరకు

ఆప్షన్స్ ఫ్రీజింగ్ సమయం – నవంబర్ 21

సీట్లు కేటాయింపు – నవంబర్ 24

వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – నవంబర్ 24 నుంచి నవంబర్ 26 వరకు

కేటాయించిన కళాశాలలో రిపోర్టింగ్ – నవంబర్ 24 నుంచి నవంబర్ 26 వరకు