టీఎస్: సీపీజీఈటీ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు

TS: CPGET Self Reporting Deadline Extension

0
88

ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్ల తొలి ఫేజ్‌లో అభ్యర్థులకు సీట్లు అలాట్ చేసింది. వీరందరూ వర్సిటీలో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిన గడువును పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీపీజీఈటీ-2021 కన్వీనర్ ఒక ప్రకటన చేశారు.

తొలి విడతలో సీట్లు అలాట్ చేసిన అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్‌ తేదీని ఈ నెల 15 వరకూ పొడిగిస్తున్నట్లు ఈ ప్రకటనలో తెలిపారు. దీనిపై మరింత సమాచారం కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్లు www.ouadmissions.com లేదా www.osmania.ac.in లో చెక్ చేసుకోవాలని సూచించారు.

తెలంగాణలోని ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాలతో పాటు జేఎన్‌టీయూహెచ్‌లోని ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్-సీపీజీఈటీ) పరీక్ష నిర్వహిస్తారు.