గుడ్ న్యూస్: టికెట్ల ధరల పెంపుపై టీటీడీ కీలక నిర్ణయం

0
91

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభించి పది రోజులవుతోందని.. రెండు సంవత్సరాల తరువాత సర్వదర్సనాన్ని ప్రారంభించామని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే టికెట్ల ధరల పెంపుపై కీలక  ఏ సేవల ధరలు పెంచే ఆలోచన టిటిడికి లేదని… ఆర్జిత సేవల ధరలను పెంచే ఆలోచన ఇప్పట్లో లేదని తేల్చి చెప్పారు. ధరల పెంపుపై కేవలం చర్చ మాత్రమే పాలకమండలిలో జరిగిందని.. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టిటిడి పాలకమండలి ముఖ్య ఉద్దేశమన్నారు.