శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త

0
161

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం  శుభవార్త చెప్పింది. నేడు ఉదయం 9 గంటలకు స్పెషల్ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ కోటాకు సంబంధించిన టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది టీటీడీ.

300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను వివిధ స్లాట్లులో ఇవ్వనున్నట్లు ఆలయ నిర్వాహణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ఇటీవల తెలిపారు. అక్టోబర్‌ నెలలో బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఆగస్టు 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ఇటీవల తెలిపారు.

మరోవైపు తిరుమల కొండ భక్తజనంతో నిండి పోయింది. దీంతో టీటీడీ యాత్ర సదన్, కల్యాణ కట్ట, అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, అఖిలాండం, ఇతర యాత్రా ప్రదేశాలు వంటి ప్రాంతాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి.