Breaking News : టీటీడీ సంచలన నిర్ణయం – భక్తులకు షాక్

0
96

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు  కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో భక్తులకు షాక్ ఇస్తూ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలులోకి రానున్నట్టు టీటీడీ వెల్లడించింది.

ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, బ్యాగులు, ఆఖరికి షాంపూ ప్యాకెట్లను కూడా కొండపైకి అనుమతించకపోవడమే కాకుండా..అలిపిరి టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక సెన్సార్లు పెట్టి కేవలం ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే తీసుకెళ్లడానికి అవకాశం కల్పిస్తున్నారు. భక్తులు ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా బయోడిగ్రేడబుల్ లేదా పేపర్ కవర్లలో తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఈ నిర్ణయం అందరి బాగోగు కోసం తీసుకున్నట్టు టీటీడీ వెల్లడించింది.