మంగళవారం ఈ పూజ చేస్తే సిరిసంపదలు ఆరోగ్యం మరి ఆపూజ ఏమిటంటే

మంగళవారం ఈ పూజ చేస్తే సిరిసంపదలు ఆరోగ్యం మరి ఆపూజ ఏమిటంటే

0
101

ప్రతీ రోజు దైవానికి ప్రీతికరమైన రోజే..అయితే మంగళవారం నాడు హనుమంతుడ్ని కుమారస్వామిని అమ్మవారిని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు, అయితే ఈరోజు ఆ దైవాలకు ప్రీతికరమైన రోజు, చాలా మంది అభిషేకాలు చేస్తారు కుమారస్వామికి.

మంగళవారం రోజున సూర్యోదయానికి ముందుగా లేచి స్నానమాచరించి పూజగదిని శుభ్రం చేసుకుని పటాలను పసుపు, కుంకుమలతో బొట్టుపెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి. దీపం వెలిగించి స్వామిని కొలుచుకోవాలి, ఇలా పూజ చేసిన తర్వాత కుమారస్వామి ఆలయానికి వెళ్లాలి.

ఇలా 5 వారాలు నిష్టగా పూజ చేయడం వల్ల ఏదైనా కోరిక కోరుకుంటే ఆ స్వామి తీరుస్తారట, ఇక సంతానం కోసం చూసేవారు ఇలా చేయడం వల్ల చాలా మంచిది, ఇలా పూజలు చేయడం వలన అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెబుతున్నారు పండితులు..ఎరుపు రంగు దుస్తులకు ధరించి ఆలయాలకు వెళితే మంచిది. ఇక స్వామికి గులాబీలు ఎర్రమందారం పూలు సమర్పించండి.