హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో నిలిచిపోయిన రాకపోకలు..ట్రాఫిక్ లో చిక్కుకున్న రెండు అంబులెన్సులు

Two ambulances stuck in traffic on the Hyderabad-Vijayawada route

0
112

చౌటుప్పల్‌: హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. చౌటుప్పల్‌ దండుమల్కాపురం వద్ద రాకపోకలు స్తంభించిపోయాయి. దండుమల్కాపురం వద్ద రోడ్డు మరమ్మతులు చేపడుతుండటం వల్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రెండు అంబులెన్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ స్తంభించినా క్రమబద్ధీకరించేందుకు ఎన్‌హెచ్‌ అధికారులు స్పందించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్‌హెచ్‌ అధికారుల వైఖరిపై వాహనదారులు మండిపడ్డారు.