పెళ్లి చేసుకున్న ఇద్దరు పురుషులు..మొదటి ‘గే’ వివాహం ఇదే..ఎక్కడో తెలుసా?

Two married men..this is the first ‘gay’ marriage..do you know somewhere?

0
88

విదేశాల్లో ప్రేమకు జెండర్ తో సంబంధం లేదు. అక్కడ అమ్మాయి, అమ్మాయిని, అబ్బాయిని అబ్బాయి ప్రేమించవచ్చు. ఆ ప్రేమ మరింత ఎక్కువైతే జీవితాంతం కలిసి ఉండడానికి పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఇది విదేశాల్లో నడుస్తున్న సంస్కృతి.

అదే మన దేశంలో యువతి, యువకుడు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. లేదంటే పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంటారు. కానీ తాజాగా తెలంగాణలో కూడా ఇలాంటి వివాహమే జరిగింది. ఇద్దరు పురుషులు ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. దీనితో  తెలంగాణాలో పెళ్లి చేసుకున్న మొదటి గే జంటగా రికార్డ్ సృష్టించారు.

ఎనిమిదేళ్ల క్రితం డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన సుప్రియో, అభయ్ ల స్నేహం ప్రేమగా మారింది. వికారాబాద్ హైవేలోని ట్రాన్స్ గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్‌లో శనివారం జరిగిన తెలంగాణ తొలి స్వలింగ సంపర్కుల వివాహ వేడుక కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభంగా జరిగింది. అందరి సమక్షంలో సుప్రియో, అభయ్ లు ఒక్కటయ్యారు..  సుప్రియో హైదరాబాద్‌లో.. హోటల్‌ మెనేజ్‌మెంట్‌ స్కూల్‌లో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. అదేవిధంగా అభయ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో డెవలపర్‌గా పని చేస్తున్నాడు.