లాక్ డౌన్ లో రెండు పెళ్లిళ్లు చివరకు ఇలా దొరికిపోయాడు – మాములోడు కాదు

లాక్ డౌన్ లో రెండు పెళ్లిళ్లు చివరకు ఇలా దొరికిపోయాడు - మాములోడు కాదు

0
140

కొంతమంది కేటుగాళ్లు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటారు అమ్మాయిలని సులువుగా మోసం చేస్తారు, ఇలాంటి కేసులు ఎన్నో వస్తూ ఉంటాయి. లాక్ డౌన్ కు ముందు పెద్దల సమక్షంలో ఓ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఓయువకుడు.

అదే నెలలో మరో మహిళను వివాహం చేసుకున్నాడు. మొదట పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇంటి దగ్గరే ఉంచి ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు.ఇక లాక్ డౌన్ వల్ల తాను ఇంటికి రాలేకపోతున్నా అని చెప్పాడు.

ఇక చివరకు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడ కాపురం పెట్టాడు, ఓరోజు భర్తకు ఫోన్ చేయగా ఆ యువకుడి ఇంకో భార్య ఫోన్ ఎత్తి ఎవరు మీరు అని ప్రశ్నించింది. దీంతో అసలు నిజం అప్పుడు బయట పడింది.తను అతని భార్య అని చెప్పింది, దీంతో ఇద్దరికి ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు, ఒకరి పెళ్లి ఫోటోలు ఒకరు పంపుకున్నారు, చివరకు ఇప్పుడు ఇద్దరూ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేశారు.