2 వేల కోసం 50 గుడ్లు తింటానని పందెం చివరకు విషాదం

2 వేల కోసం 50 గుడ్లు తింటానని పందెం చివరకు విషాదం

0
104

కొన్నిసార్లు పందెం కాస్తూ ఉంటారు కొందరు..ఈ పందాలు తిండి పైన కూడా జరుగుతూ ఉంటాయి… ఈ సమయంలో కడుపు నిండినా పొట్టలో అసౌకర్యంగా ఉన్నా వెంటనే వారు అస్వస్ధతకు గురి అవుతారు….తాజాగా ఇలాంటి పందెం ఓ నిండు ప్రాణం తీసింది..సుభాష్ యాదవ్ అనే 42 ఏళ్ల వ్యక్తి రూ.2 వేల కోసం తన స్నేహితులతో పందెం కట్టాడు.

 

50 గుడ్లను ఆగకుండా తినేస్తానని తెలిపాడు. ఇక స్నేహితులు అతని ముందు 50 గుడ్లు పెట్టారు ..వెంటనే ఒక్కొక్కటి తినేస్తూ ఉన్నాడు, కాని ఇలా తింటున్న సమయంలో ఒక్కసారిగా సృహ తప్పి పడిపోయాడు, వెంటనే అతనిని వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లారు కాని అతను అప్పటికే చనిపోయాడు.

 

 

ఇలా ఒకేసారి గుడ్లు తినడం వల్ల అతను చనిపోయాడు..ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినడం వల్ల అతడి జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందని చెబుతున్నారు వైద్యులు.. అయితే అతిగా కొడుగుడ్లు ఒకేసారి తీసుకుంటే గుడ్డులో ఉండే పచ్చ సొనలో అధిక కొవ్వులు ఉంటాయని, దీనివల్ల గుండె పనితీరు నెమ్మదించి ప్రాణాలు పోతాయని తెలిపారు. ఒకటి లేదా రెండు గుడ్లు మాత్రమే తీసుకోవాలి అని వైద్యులు తెలియచేస్తున్నారు.