ఉల్లిపాయలు కోస్తే కన్నీరు వస్తుందా – ఇలా చేయండి అస్సలు రాదు – సింపుల్ చిట్కా

ఉల్లిపాయలు కోస్తే కన్నీరు వస్తుందా - ఇలా చేయండి అస్సలు రాదు - సింపుల్ చిట్కా

0
92

ఉల్లిపాయలు మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం.. చెప్పాలి అంటే ఆ ఉల్లిపాయ లేని కూర ఉండదు.. ఇక మసాలా కూరలు అయినా నాన్ వెజ్ అయినా చేపలు అయినా ఇలా ఏది చేసినా కచ్చితంగా ఉల్లి గడ్డ ఉండాల్సిందే… దాని ఘాటు తెలియాల్సిందే.. అయితే ఉల్లిపాయ కోసిన వెంటనే మనకు కన్నీరు వస్తుంది.. ఆ ఆమ్లాల ఘాటు వెంటనే ఎవరికి అయినా కన్నీరు తెప్పిస్తుంది.

 

 

ఉల్లిని కోయాలి అంటే అమ్మాయిలు కూడా బాగా ఆలోచిస్తారు. కన్నీరు వస్తుంది అని ఆగుతారు… అయితే పెద్దలు చెప్పేది ఆ ఉల్లిపాయ తొడిమి తీసి నీటిలో వేస్తే ఆ నీటిలో ఉండటం వల్ల ఘాటు తగ్గుతుంది అంటారు…అయితే మరో చిట్కా కూడా చెబుతున్నారు ఓ వ్యక్తి.

 

తడిగా ఉన్న ఒక వస్త్రాన్ని తీసుకుని దానిని కూరగాయలు కట్చేసే చాపింగ్ బోర్డు మీద ఉంచాలి. తరువాత మీరు ఎన్ని ఉల్లిపాయలు కోయాలనుకుంటున్నారో వాటన్నింటిని ముక్కలుగా చేసేయండి, ఇక ఆ ఉల్లిలో ఉండే ఆమ్లాలు ఆ క్లాత్ పైకి చేరతాయి.. దీని వల్ల అవి కంటికి తగలవు .. ఆమ్లాలను ఆ క్లాత్ పీల్చుకుంటుంది.