అతి దారుణంగా ఓ యువతిని అత్యాచారం చేసి చంపేశారు ఈ కామాంధులు, చివరకు నేడు ఉరి కంభం ఎక్కి చనిపోయారు, నేడు ఉదయం వారు సూర్యోదయం చూడలేదు అనే చెప్పాలి, అయితే ఉరికి గంట ముందు ఏం జరిగింది అంటే.
వీరు నలుగురిని జైలు అధికారులు తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేపారు, దోషులు ముఖేశ్ సింగ్ , వినయ్ శర్మ , అక్షయ్ ఠాకూర్ సింగ్, పవన్ గుప్తా నిద్రలేవగానే భయంగా కనిపించారు, స్నానం పూర్తి అయిన తర్వాత ఇష్టదైవాల పూజల కోసం సమయం ఇచ్చారు. కాని వారు వద్దు అన్నారు, ఏ పూజ చేయలేదు.
తర్వాత టిఫిన్ ఇచ్చారు నలుగురు కూడా తిన్నారు, సమయం అప్పటికి 5 అయింది,తర్వాత తీహార్ జైలు వైద్యులు నలుగురు దోషులనూ పరీక్షించి, వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. నలుగురినీ 3వ నంబర్ బ్యారక్ లో ముందుగానే సిద్ధం చేసిన ఉరికంబాల దగ్గరకు నడిపించారు, వారికి ముఖానికి కాటన్ వస్త్రం కట్టి ఉరికంబం ఎక్కించారు… జిల్లా మెజిస్ట్రేట్ ముందు వీరు నిలబడ్డారు.
వారి చేతులను వెనక్కు కట్టారు. జిల్లా మేజిస్ట్రేట్ తో పాటు తీహార్ జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్ తదితరుల సమక్షంలో 5.30 గంటలకు వారిని తలారి పవన్ ఉరి తీశారు. ఈ సమయంలో తలారిని దోషులు ఎవరూ చూడకుండా జాగ్రత్త పడ్డారు. చివరకు వీరు నలుగురు అరగంట ఉరికంభం పై ఉన్నారు, 50 మంది సెక్యూరిటీ జైలు దగ్గర ఉన్నారు, అరగంట తర్వాత వీరు నలుగురు చనిపోయారు అని డాక్టర్ ధ్రువీకరించారు.