బీటెక్ పూర్తి జాబ్ కోసం కోసం ఎదురుచూసేవారికి చక్కని అవకాశం కల్పిస్తుంది కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.
భర్తీ చేయనున్న ఖాళీలు: 40
పోస్టుల వివరాలు: గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రెయినీ పోస్టులు
విభాగాలు: ఈసీఈ , మెకానికల్, సీఎస్‌ఈ విభాగాలలో ఖాళీలు ఉన్నాయి.
అర్హులు: కనీసం 60 శాతం మార్కులతో బీటెక్ లేదా బీఈ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు గేట్-2022 వ్యాలిడ్ స్కోర్ ను కలిగి ఉండాలి.
జీతం: రూ. 54,880 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: మే 14, 2022