వాక్సిన్ వేసుకుంటే బిర్యానీ ఫ్రి ఎక్కడో తెలుసా

వాక్సిన్ వేసుకుంటే బిర్యానీ ఫ్రి ఎక్కడో తెలుసా

0
94

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.. రోజుకి ఏకంగా 1.50 లక్షల కేసులు నమోదు అవుతున్నాయి అంటే పరిస్దితి అర్దం చేసుకోవచ్చు ఎలా ఉందో. ఇక ఓ పక్క వాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేశారు, అయితే కొన్ని స్టేట్స్ లో కరోనా కేసులు మాత్రం భారీగా నమోదు అవుతున్నాయి.

 

కొంతమంది ప్రజల నిర్లక్ష్యం మూలంగా కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇక కొందరు వ్యాక్సిన్ తీసుకోవడానికి తెగ ఆలోచిస్తున్నారు…కొందరు ఏదైనా జరుగుతుంది అని భయపడి వ్యాక్సిన్ తీసుకోవడం లేదు.. దీంతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రభుత్వాలు పలు సంస్ధలు కూడా కృషి చేస్తున్నాయి, ఇప్పటికే వాక్సిన్ వేసుకుంటే పలు సంస్ధలు అనేక ఆఫర్లు ఇస్తున్నాయి ఇలాంటి వార్తలు మనం విన్నాం.

 

తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ సంస్థ వ్యాక్సిన్ తీసుకున్నవారికి బిర్యానీ ఫ్రీగా ఇస్తామని ముందుకొచ్చింది. ఈ వార్త ఇప్పుడు పెద్ద వైరల్ అయింది, విజయనగరంలో ఉన్న హలో కిచెన్ (Hello kitchen) ఈ సంస్ధ ఈ ఆఫర్ ఇచ్చింది, వీరికి విజయనగరం అలాగే కాకినాడలో బ్రాంచీలు ఉన్నాయి, సో మీకు బిర్యానీ కావాలి అంటే మీరు వ్యాక్సిన్ వేయించుకున్న ఫ్రూఫ్ చూపించాలి ఇక టీకా ఉత్సవంలో భాగంగా 2021, ఏప్రిల్ 11వ తేదీ ఆదివారం నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ ఆఫర్ ఉండనుంది. అయితే ఇది కేవలం తొలి వంద మందికి మాత్రమే అందచేస్తాము అని తెలిపారు. ఆ వంద మందిలో మీరు ఉండవచ్చు.