వ‌ద్ద‌న్నా ఆ ప‌ని చేశాడు చివ‌ర‌కు ప్రాణాలు తీసుకున్న ప్ర‌ధానోపాధ్యాయుడు

వ‌ద్ద‌న్నా ఆ ప‌ని చేశాడు చివ‌ర‌కు ప్రాణాలు తీసుకున్న ప్ర‌ధానోపాధ్యాయుడు

0
117

ఏదైనా మ‌నం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే దానిపై మ‌న‌కు పూర్తి అవ‌గాహ‌న ఉండాలి, ముఖ్యంగా షేర్ల విష‌యంలో ఇదే తెలుసుకోవాలి, తెలిసి తెలియ‌కుండా చాలా మంది అప్పుచేసి మ‌రీ షేర్లు కొంటారు, చివ‌ర‌కు షేర్లు విలువ త‌గ్గితే, వారు ఏం చేయ‌లేక అప్పులు తీర్చ‌లేక ఆత్మ‌హ‌త్య చేసుకుంటారు.

తాజాగా తెలంగాణ‌లో ఓ ప్రధానోపాధ్యాయుడు ఇలాగే షేర్ల‌లో పెట్టుబ‌డి పెట్టాడు, ఆయనకు అందులో నష్టాలు రావడంతో తట్టుకోలేకపోయాడు. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు కూడా ఆయనను వేధించాయి. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆయన నిన్న ఉదయం స్కూటీపై బ‌య‌ట‌కు వెళ్లాడు.

గ్రామ శివారులోని ఓ రైసుమిల్లు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. షేర్ మార్కెట్ నష్టాలే తన ఆత్మహత్యకు కారణమని,త‌ప్పుచేశాను అని క్ష‌మించాలి అని సూసైడ్ నోట్ రాసి చ‌నిపోయాడు, అయితే ఇలా పెట్టుబ‌డి ఎక్కువ పెట్ట‌ద్దు అని చాలా మంది ఆయ‌న‌కు గ‌తంలో చెప్పార‌ట‌, కాని ఆయ‌న ఇలా పెట్టుబ‌డి పెట్టారు, ఆయ‌న‌కు కుమార్తె కుమారుడు భార్య ఉన్నారు, ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది.