వాడిపోయిన పూలతో వ్యాపారం దేశంలోనే సరికొత్త బిజినెస్ – ఐడియా అదిరింది

వాడిపోయిన పూలతో వ్యాపారం దేశంలోనే సరికొత్త బిజినెస్ - ఐడియా అదిరింది

0
111

ఈ రోజుల్లో వ్యాపారం అంటే సరికొత్తగా ఉండాలి.. బయట మార్కెట్లో లేని వ్యాపారాలు అయితేనే బెటర్ పోటీ తక్కువగా ఉంటుంది, ఈజీగా మార్కెట్లో ముందుకు వెళ్లవచ్చు,అంతేకాదు పెట్టుబడులు బాగా వస్తాయి, ఇలా ఎన్నో కంపెనీలు సక్సెస్ అయ్యాయి, అయితే తాజాగా ఇప్పుడు ఇలాంటి ఓ వ్యాపార ఆలోచన అందరిని ఆకట్టుకుంటోంది.

పూల వ్యాపారం తెలుసుకదా కాని పూలు వాడిపోతే ఏం చేస్తాం పాడేస్తాం కొందరు మట్టిలో వేస్తారు మరికొందరు చెత్తలో వేస్తారు, అయితే ఈ వాడిపోయిన పూలతో వ్యాపారం చేస్తున్నారు, ఈ సంగతి కొత్త వ్యాపారం ఏమిటో చూద్దాం.

ఢిల్లీకి చెందిన అంకిత్ అగర్వాల్ నదిలో వేస్తున్న పాడైపోయిన పూలను చూసి వీటితో ఏం చేయవచ్చు అని ఆలోచించాడు, నది కూడా కలుషితం అవుతోంది అని ఆలోచన చేశాడు, ఇలా గుడిలో తనకు పాడైపోయిన పూలు ఇవ్వాలి అని ఒప్పందం చేసుకున్నాడు అలా తెచ్చిన వాటితో అగరబత్తీలు తయారు చేశాడు అగర్బత్తులతో పాటు ఇన్సెన్స్ కోన్స్, వెర్మికంపోస్ట్ వంటి వాటిని అమ్ముతున్నాడు ఈ వస్తువులు పర్యావరణానికి ఎలాంటి హాని చేయవు.

వ్యాపారం బాగుంది మంచి ఉపాధి ఇచ్చాడు.. చాలా మందికి 290 దాటి కొనుగోలు చేస్తే మీకు ఇంటికి ఫ్రీ డెలివరీ ఇస్తున్నారు….PHOOL అని తన వెబ్సైట్ పెట్టాడు ఇందులో మార్కెట్ చేస్తున్నాడు, ఈ సంస్థకు రిటైల్ స్టోర్లు కూడా ఉన్నాయి… మన భాగ్యనగరంలో కూడా ఉంది సికింద్రాబాద్ లో.. సో మంచి బిజినెస్ ఆలోచన కదా.