దిశ ఘటన పై సినిమా కోసం వర్మ ఏం చేస్తున్నారంటే

దిశ ఘటన పై సినిమా కోసం వర్మ ఏం చేస్తున్నారంటే

0
98

హైదరాబాద్ శివారులోని శంషాబాద్ సమీపంలో సంచలనం రేపింది దిశ ఘటన.. ఈ దారుణమైన దుర్మార్గపు ఘటనతో సమాజం అంతా రోడ్లపైకి వచ్చారు, అమ్మాయిలకి రక్షణ లేదా అని దేశం మొత్తం ఏకమైంది, ఏకంగా పార్లమెంట్ లో కూడా దీని గురించి చర్చించారు, అయితే ఈ దారుణమైన ఘటన గురించి సినిమా తీస్తాను అని చెప్పారు రామ్ గోపాల్ వర్మ.

ఈ విషయంలో ఇప్పటికే ఆయన రేపిస్ట్ చెన్నకేశవులు భార్యను కూడా కలిసి పలు వివరాలు తెలుసుకున్నారు… అంతేకాదు ఆయన దిశ ఘటన జరిగిన ప్రాంతంలో మొత్తం పరిసరాలు అన్నీ చూశారు.. అసలు ఇలాంటి ఘటన జరగడానికి కారణాలు అక్కడ వారికి అనుకూలంగా మార్చుకున్న పరిస్దితులు అన్నీ కూడా వర్మ ముందుగానే పరిశీలించారు..

ఇక నిందితులు నలుగురు గురించి వారి కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా ఆయన
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిధి పోలీసు స్టేషన్కు వెళ్లారు. శంషాబాద్ ఏసీపీని కలిసి దిశ కేసుకు సంబంధించి, పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన చెప్పిన వివరాలు సినిమాకు ఉపయోగపడతాయని తెలిపారు, అయితే అక్కడ పోలీసులు ఈకేసుని ఛేదించిన విషయం తెలిసిందే.