వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య…

వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య...

0
110

కర్నూల్ జిల్లా బేతంచెర్ల ఆర్ ఎస్ రంగాపురంలో దారుణం జరిగింది… భర్త అలాగే అత్తా మామల వేధింపులు తట్టుకోలేక వివాహిత ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది… పూర్తి వివరాలు ఇలా ఉన్నారు… భూమనపాడుకు చెందిన మాధవికి ఆర్ ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన వెంకటస్వామి లక్ష్మీదేవిల కుమారుడు సుబ్బరాయుడు తో వివాహం అయింది…

వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు కుటుంబ కలహాలతో అత్తా మామలు, భర్త వేధింపులు తట్టుకోలేక ఇంట్లో చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని మృతి చెందినట్లు మాధవి తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు…

దీంతో మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు… పోస్ట్ మార్టం నిమిత్తం మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు…