వీగన్ ఈ మాట ఈ మధ్య చాలా మంది దగ్గర వింటున్నాం ,, అయితే ఈ వీగన్ అంటే ఏమిటి ఏం పాటించాలి అనేది చూస్తే,
జంతు, పక్షి సంబంధమైన ఫుడ్ తీసుకోకూడదు, అంటే పాలు ఆవు నుంచి వస్తాయి కాబట్టి పాలు కూడా తీసుకోరు, అసలు జంతువుల నుంచి వచ్చే ఎలాంటి ఫుడ్ తీసుకోరు.
చికెన్, మటన్ తో పాటు ఎలాంటి మాంసాహారం తీసుకోరు, పాలు, పెరుగు కూడా బంద్.. ఇది ఇప్పుడు చాలా మంది పాటిస్తున్నారు, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా కొందరు పాటిస్తున్నారు, అలాగే . క్రికెటర్ విరాట్ కొహ్లీ , అలాగే నటి రకుల్ కూడా ఇది ఫాలో అవుతున్నారు.
చాలా మంది హీరోయిన్లు హీరోలు ఇది ఫాలో అవుతున్నారు, అయితే ఈ రోజుల్లో ఇలాంటివి ఫాలో అవ్వడం అంటే చాలా గ్రేట్, ఎందుకు అంటే ఇప్పుడు అంతా అవుట్ సైడ్ ఫుడ్ నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారు, ఇలాంటి సమయంలో యువత వీగన్ గా మారుతున్నారు, ఇలా క్రమశిక్షణగా ఫుడ్ లో తీసుకుంటే మంచి ఆరోగ్యం వస్తుంది.
.